Telangana: లెక్కించాల్సిన ఐదు వీవీ ప్యాట్స్ ను లాటరీ ద్వారా ఎంపిక చేస్తాం: రజత్ కుమార్

  • ఆర్వో, ఏఆర్వోలకు ఓట్ల లెక్కింపుపై శిక్షణ
  • మొదట సర్వీసు ఓటర్ల ఎలక్ట్రానిక్ ఓట్లను లెక్కిస్తాం
  • ఆ తర్వాత పోస్టల్  బ్యాలెట్స్ లెక్కింపు

ఈసీ ఆదేశాల మేరకు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇచ్చామని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో లోక్ సభ రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొదట సర్వీసు ఓటర్ల ఓట్లు, తర్వాత పోస్టల్ బ్యాలెట్లు, ఆపై ఈవీఎంలను, చివరగా వీవీప్యాట్స్ లెక్కింపు ఉంటుందని చెప్పారు. లెక్కించాల్సిన ఐదు వీవీప్యాట్స్ లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఈవీఎంల, వీవీప్యాట్ ల లెక్కింపులో తేడా ఉంటే వీవీప్యాట్ ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.  

More Telugu News