vizag: మంత్రి పదవికి రాజీనామా చేసిన కిడారి శ్రావణ్

  • సీఎంఓలో తన రాజీనామా లేఖ సమర్పించిన శ్రావణ్
  • రాజ్యాంగ నిబంధనలకు లోబడి రాజీనామా చేశా
  • 6 నెలల పదవీకాలంలో 3 నెలలు ఎన్నికల కోడ్ కే పోయింది
ఆంధ్రప్రదేశ్ గిరిజన, వైద్య శాఖ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పదవీకాలం రేపటితో పూర్తి కానుంది, ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లో సమర్పించారు. సచివాలయంలో ఉన్న సీఎంఓ కు ఈరోజు సాయంత్రం ఆయన వెళ్లారు. రాజీనామా లేఖ అందజేసిన అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ నిబంధనలకు లోబడి తన పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. మంత్రిగా ఆరు నెలల పదవీకాలంలో మూడు నెలల కాలం ఎన్నికల కోడ్ కే పోయిందని అన్నారు. సీఎం చంద్రబాబు తనను వారి కుటుంబసభ్యుడిగా చూసుకున్నారని ప్రశంసించారు. తన శాఖ ద్వారా గిరిజనులకు ఫుడ్ బాస్కెట్ పథకం తీసుకురావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
vizag
sravan kumar
minister
cmo
resign

More Telugu News