Mahesh Babu: నీ కష్టం నాకు తెలుసు: మహేశ్ బాబుపై నమ్రత వ్యాఖ్య

  • మహర్షి కోసం నీ శ్రమ, అంకితభావం చూశాను
  • ఇప్పుడది తక్కిన ప్రపంచం కూడా చూస్తుంది
  • ప్రతి ఒక్కరూ రిషిని ప్రేమిస్తారనుకుంటున్నా
టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు నటించిన మహర్షి చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత శిరోద్కర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు. సినిమా విడుదలయ్యే గురువారం ఎంతో ముఖ్యమైన రోజని పేర్కొన్నారు.

"మహర్షి చిత్రం కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. రిషి పాత్ర ద్వారా ప్రేక్షకులకు నమ్మశక్యం కాని అనుభూతిని అందించడం కోసం నువ్వు చూపించిన అంకితభావం, నువ్వు పడిన కఠోర శ్రమ నేను చూశాను. ఇప్పుడు నీ కష్టాన్ని తక్కిన ప్రపంచం కూడా చూసే సమయం వచ్చింది. గుడ్ లక్ ప్రియతమా! నాలాగే ప్రతి ఒక్కరూ రిషిని ప్రేమిస్తారని నమ్ముతున్నాను" అంటూ భావోద్వేగాలు ప్రదర్శించారు.
Mahesh Babu
Namrata
Maharshi

More Telugu News