yadagirigutta: యాదగిరిగుట్టలో చిన్నారిని ఢీకొట్టిన పోలీస్ వాహనం

  • పాత నర్సింహస్వామి ఆలయం వద్ద ఘటన
  • చిన్నారి పరిస్థితి విషమం
  • ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలింపు
యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీస్ వాహనం ఢీకొని చిన్నారికి గాయాలయ్యాయి. యాదగిరిగుట్ట పాత నర్సింహస్వామి ఆలయం వద్ద ఈరోజు మధ్యాహ్నం సమయంలో మూడేళ్ల చిన్నారి ప్రణతిని పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టింది. దైవ దర్శనం అనంతరం దేవాలయం పరిసరాల్లో ప్రణతి, ఆమె తండ్రి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ప్రణతిని ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 
yadagirigutta
police
escort
vehicle

More Telugu News