Uttarakhand: తెరుచుకున్న ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ దేవాలయం

  • ఆరు నెలల అనంతరం తొలిసారి ఈరోజు పూజలు
  • కేదారేశ్వరుని దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
  • రేపు తెరుచుకోనున్న బద్రీనాథ్‌ ఆలయం
సుదీర్ఘ విరామం తర్వాత ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్‌ ఆలయం తలుపులు ఈరోజు తెరుచుకున్నాయి. తొలిసారి ఈరోజు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరు నెలల అనంతరం ఆలయ ద్వారాలు తెరుచుకోవడంతో కేదారేశ్వరుని దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

ఏటా అక్షయ తృతీయ సందర్భంగా పవిత్ర చారధామ్‌ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ను సందర్శిస్తారు. చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమైన రోజే గంగోత్రి, యమునేత్రి తెరుచుకోగా ఈ రోజు కేదార్ నాథ్‌ ఆలయం తెరుచుకుంది. రేపు బద్రీనాథ్‌ ఆలయం తెరుచుకోనుంది.
Uttarakhand
kedarinadh temple
opened

More Telugu News