Andhra Pradesh: చంద్రబాబు ఏకంగా గవర్నర్ పైనే ఒత్తిడి తెస్తున్నారు.. ఇది దారుణం!: విజయసాయిరెడ్డి

  • సమాచార కమిషనర్ల నియామకంపై వ్యాఖ్య
  • ఐదేళ్లు నిద్రపోయి ఇప్పుడు నియమిస్తామంటున్నారు
  • గవర్నర్ కొత్త ప్రభుత్వానికి ఆ ఛాన్స్ ఇవ్వాలి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరో 15 రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తుందనగా, చంద్రబాబు గవర్నర్ నరసింహన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కొత్త సమాచార కమిషనర్లను నియమించాల్సిందిగా ఆయన నరసింహన్ ను బలవంతం చేస్తున్నారనీ, ఇది దారుణమని వ్యాఖ్యానించారు.

ఐదేళ్లు నిద్రపోయిన చంద్రబాబు ప్రభుత్వం ఆఖరి నిమిషంలో సమాచార కమిషనర్ల నియామకాలు జరపడం అనైతికతకు పరాకాష్ట అని మండిపడ్డారు. గవర్నర్ నరసింహన్ ఈ నియామకాలను ఆమోదించరాదని కోరారు. కొత్త ప్రభుత్వానికి సమాచార కమిషనర్లను నియమించే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Vijay Sai Reddy

More Telugu News