Telangana: మరణానికి 'లిఫ్ట్'.. హైదరాబాద్ లో ప్రాణాలు కోల్పోయిన మహిళ!

  • రాజేంద్రనగర్ లోని బండ్లగూడలో వివాహం
  • కన్వెన్షన్ హాల్ బుక్ చేసిన కుటుంబ సభ్యులు
  • తీవ్రగాయాల పాలైన మహిళ, చికిత్స పొందుతూ దుర్మరణం
ఓ లిఫ్ట్ మహిళ పాలిట యమపాశంగా మారింది. వివాహ వేడుకకు హాజరైన సదరు మహిళ మరో అంతస్తులోకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కగా ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణలోని హైదరాబాద్ లో నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నగరంలోని రాజేంద్రనగర్ బండ్లగూడ కేకే కన్వెన్షన్‌ హాల్‌లో ఓ వివాహం జరుగుతోంది. దీనికి ఇరు కుటుంబాల బంధువులు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఓ మహిళ మరో అంతస్తులోకి వెళ్లేందుకు లిఫ్ట్ లోకి వెళుతుండగా ఆమె కాలు లిఫ్ట్ తలుపులో ఇరుక్కుపోయింది. అంతలోనే లిఫ్ట్ ఒక్కసారిగా పైకి కిందకు కదలడంతో బాధితురాలికి తీవ్రగాయాలు అయ్యాయి.

ఆమె కేకలు విన్న బంధువులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన అనంతరం కన్వెన్షన్ యజమాని పరారయ్యాడు. మరోవైపు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana
Hyderabad
marriage
accident

More Telugu News