Mahesh Babu: అందుకే మహేశ్ బాబు సూపర్ స్టార్ అయ్యారు: రాజీవ్ కనకాల

  • మహేశ్ బాబు అద్భుతంగా చేశారు 
  • అందరినీ ఆయన ఎంతో గౌరవిస్తారు
  •  సెట్ కి వస్తే పని తప్ప మరో ధ్యాస ఉండదు  
బుల్లితెర నుంచి నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన రాజీవ్ కనకాల, వెండితెరపై కూడా నటుడిగా తనని తాను నిరూపించుకున్నారు. ఈ రోజు విడుదలైన 'మహర్షి' సినిమాలో ఆయన ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'అతడు' తరువాత మళ్లీ మహేశ్ బాబుతో కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది.

'అతడు' సినిమాలో రాజీవ్ కనకాలకి .. ఈ సినిమాలో కనిపించే రాజీవ్ కనకాల పూర్తి భిన్నంగా ఉంటాడు. ఇక నా విషయం పక్కన పెడితే .. ఈ సినిమా కోసం మహేశ్ బాబు ఎంతో కష్టపడ్డారు. ఆయన అద్భుతంగా చేశారు అని ఈ రోజున నేను కొత్తగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి నటిస్తూ వస్తున్నారు. నటీనటులను .. సాంకేతిక నిపుణులను ఆయన ఎంతో గౌరవిస్తారు. సెట్ కి వచ్చింది మొదలు తన వర్క్ పైనే దృష్టిపెట్టి పని చేసుకుని వెళ్లిపోతారు. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు" అని చెప్పుకొచ్చారు.  
Mahesh Babu
rajiv kanakala

More Telugu News