IIT Madras: ఐఐటీ మద్రాస్‌కూ పాకిన ఐపీఎల్ ఫీవర్.. టాస్ గెలిస్తే ధోనీ ఏం చేస్తాడంటూ విద్యార్థులకు ప్రశ్న!

  • ‘మెటీరియల్‌ అండ్‌ ఎనర్జీ బ్యాలెన్స్‌’ పరీక్షలో ప్రశ్న
  • పిచ్‌పై తేమ, వాతావరణ పరిస్థితిని వివరిస్తూ ప్రశ్న అడిగిన వైనం
  • ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఐసీసీ

ఐపీఎల్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్వాలిఫయర్ మ్యాచ్-1లో ముంబైతో తలపడిన చెన్నై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోజు దేశంలోనే పేరెన్నికగన్న మద్రాస్ ఐఐటీ ‘మెటీరియల్‌ అండ్‌ ఎనర్జీ బ్యాలెన్స్‌’ పరీక్షలో విద్యార్థులకు సంధించిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

ఐపీఎల్‌ క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ ధోని టాస్‌ గెలిస్తే ఎం చేస్తాడు? అనేదే ఆ ప్రశ్న. ప్రొఫెసర్ విగ్నేష్ ముత్తు విజయన్ విద్యార్థులకు ఈ ప్రశ్నను సంధించి ఆశ్చర్యపరిచారు. చెన్నైలోని వాతావరణ పరిస్థితులు, మైదానంలో పిచ్‌పై ఉండే తేమ గురించి వివరిస్తూ.. ఈ పరిస్థితుల్లో టాస్ గెలిస్తే ధోనీ ఏంచేయాలని ప్రశ్నించారు. బ్యాటింగ్ ఎంచుకోవాలా? లేక బౌలింగ్ తీసుకోవాలా? అన్న ఈ ప్రశ్నకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐసీసీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కూడా దీనిని షేర్ చేసింది.

More Telugu News