Goswamy: ఆ చిన్నారి బాలికను కాపాడేందుకు ఇప్పటికే రూ.4 కోట్లకు పైగా విరాళాలు అందించిన దాతలు!

  • సన్నీవాలాకు చెందిన ధృతి నారాయణ్
  • కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లిన ధృతి
  • పాదచారులపైకి కారుతో దూసుకెళ్లిన వ్యక్తి 
  • తీవ్రంగా గాయపడిన బాలిక  

జాతి విద్వేషపూరిత దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న 13 ఏళ్ల బాలికను కాపాడేందుకు దాతలు ముందుకొస్తున్నారు. కాలిఫోర్నియాలోని సన్నీవాలేకు చెందిన భారత అమెరికన్ ధ‌ృతి నారాయణ్, గత నెల 23న కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఇసాయ్ పీపుల్స్ వ్యక్తి తన కారుతో పాదచారులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ధృతి తీవ్రంగా గాయపడింది. తలకు తీవ్ర గాయమై ప్రస్తుతం కోమాలో ఉంది.

ధృతి చికిత్స కోసం భారీగా ఖర్చవుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు గోఫండ్‌మీ అనే సంస్థను ఆశ్రయించారు. దీంతో ఆ సంస్థ ధృతి పేరుపై ఓ పేజీని రూపొందించి విరాళాలు సేకరించడం ప్రారంభించింది. ధృతి పరిస్థితిని తెలుసుకున్న అనేకులు వారం రోజుల్లోనే 6 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 4కోట్లకు పైగా విరాళాలు అందించారు. ఈ ఘటనను పోలీసులు జాతి విద్వేష దాడిగా ధ్రువీకరించారు. గతంలో ఇరాక్ సైన్యంలో పనిచేసిన ఇసాయ్ ముస్లింలపై ద్వేషం పెంచుకున్నాడు. ఘటన సమయంలో అక్కడి వారంతా ముస్లింలుగా భావించి ఉద్దేశపూర్వకంగా కారుతో దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News