nidhi agarwal: నిధి అగర్వాల్ కి క్లాస్ తీసుకున్న పూరి?

  • పూరి దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్'
  • పాస్ పోర్ట్ పోగొట్టుకున్న నిధి అగర్వాల్ 
  • యూరప్ షెడ్యూల్ వాయిదా
పూరి జగన్నాథ్ దర్శక నిర్మాతగా 'ఇస్మార్ట్ శంకర్' నిర్మితమవుతోంది. రామ్ .. నిధి అగర్వాల్ .. నభా నటేశ్ ప్రధాన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే హైదరాబాద్ .. గోవా .. వారణాసి ప్రాంతాల్లో షూటింగు జరుపుకుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇక ఈ సినిమాకి సంబంధించిన పాటలను యూరప్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ప్రయాణానికి సమయం దగ్గర పడుతుండగా, తన పాస్ పోర్ట్ కనిపించడం లేదనీ .. ఎక్కడో పోయిందని నిధి అగర్వాల్ చెప్పిందట. దాంతో అక్కడి షెడ్యూల్ వాయిదా వేసుకున్నట్టుగా సమాచారం. షూటింగు వాయిదా పడటంతో పూరికి కోపం వచ్చేసి, నిధి అగర్వాల్ కి క్లాస్ పీకినట్టుగా చెప్పుకుంటున్నారు. నిధి అగర్వాల్ కి కొత్త పాస్ పోర్ట్ వచ్చేలోగా, మిగతా పనులు పూర్తిచేసే పనిలో పూరి నిమగ్నమై వున్నాడని అంటున్నారు. 
nidhi agarwal
ram

More Telugu News