akhil: మరో లవ్ స్టోరీతో రంగంలోకి దిగుతోన్న అఖిల్

  • అఖిల్ నాల్గొవ సినిమాకి సన్నాహాలు
  •  వచ్చేనెల 2వ వారంలో రెగ్యులర్  షూటింగ్
  •  సంగీత దర్శకుడిగా గోపీసుందర్

అఖిల్ నాల్గొవ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వచ్చేనెల రెండవ వారంలో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమవుతోంది.

ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన పేరు వినిపిస్తోంది .. కానీ ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదట. త్వరలోనే హీరోయిన్ ఎవరనేది ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. లవ్ స్టోరీతో కూడిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి గోపీసుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇంతవరకూ అఖిల్ చేసిన సినిమాలు అభిమానులను నిరాశ పరుస్తూ వచ్చాయి. అందువలన ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు. 

More Telugu News