spice 2000: అత్యాధునిక స్పైస్-2000 బంకర్ బస్టర్ల కొనుగోలు యోచనలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్

  • బాలాకోట్ దాడుల్లో స్పైస్-2000 బాంబుల వినియోగం
  • వీటిలో అడ్వాన్సుడు వర్షన్ బాంబుల కొనుగోలుకు యత్నం
  • లక్ష్యాలను కచ్చితంగా ఛేదించడం వీటి గొప్పదనం

అత్యంత బలమైన బంకర్లు, శత్రువుల నిర్మాణాలను ధ్వంసం చేసే అత్యాధునిక బంకర్ బస్టర్లైన 'స్పైస్-2000' బాంబులను కొనుగోలు చేసే యోచనలో భారత వాయుసేన ఉంది. ఇటీవల పాకిస్థాన్ లోని బాలాకోట్ లో జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ లో స్పైస్-2000 బాంబులనే వాడారు. వీటికంటే మరింత మెరుగైన టెక్నాలజీ కలిగిన బాంబులను ఇప్పుడు కొనుగోలు చేయాలనుకుంటున్నారు.

ఆయుధ సామగ్రిని సమకూర్చుకోవడంలో భారత త్రివిధ దళాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి నిర్ణయాధికారాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ. 300 కోట్ల వరకు అత్యవసరంగా దేన్నైనా కొనుగోలు చేసే అధికారాలను ఇచ్చింది. ఇక స్పైస్-2000 బాంబులు ఇజ్రాయెల్ కు చెందినవి. వీటి రేంజ్ 60 కిలోమీటర్లు. ఎలక్ట్రో ఆప్టికల్ ఇమేజ్ టెక్నాలజీ కలిగిన ఈ బాంబులు వెపన్ కంప్యూటర్ మెమొరీలో స్టోర్ చేసిన డేటా ఆధారంగా లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదిస్తాయి.

More Telugu News