Andhra Pradesh: చంద్రబాబు వ్యాఖ్యలు ఈసీని అవమానపరిచేలా ఉన్నాయి: అంబటి రాంబాబు

  • ఈవీఎంలపై నాడు లేని అనుమానాలు నేడు ఎందుకు?
  • సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ‘ఫ్యాన్’కు పడిందట!  
  • బాబు బాధ్యత గల నాయకుడైతే క్షమాపణలు చెప్పాలి

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు.విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుకు ఈవీఎంలపై నాడు లేని అనుమానాలు నేడు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ఈసీని అవమానపరిచే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు.

సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఫ్యాన్ గుర్తుకు పడిందని చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతున్నారని, బాబు బాధ్యత గల నాయకుడైతే తక్షణమే క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఓటమి భయంతో ఉన్న చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, యాభై శాతం వీవీ ప్యాట్స్ ను లెక్కించాలని కోరడం అనుభవంతో కూడిన నాయకులు చేసే పనేనా? అని ప్రశ్నించారు. యాభై శాతం వీవీప్యాట్స్ లెక్కించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు ఈసీ వద్దకు వెళ్లి లెక్కించాలని కోరడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

More Telugu News