krishnareddy: 'యమలీల'లో నువ్వే హీరో అనగానే అలీ షాక్ అయ్యాడు: దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి

  • అలీ అప్పటికి చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు
  • ఈ సినిమాతో తానేమిటనేది నిరూపించుకున్నాడు 
  • హీరోగా ఆ తరువాత చాలా సినిమాలు చేశాడు     

తాజా ఇంటర్వ్యూలో 'యమలీల' సినిమాను గురించి ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, "ఈ సినిమాలో కథానాయకుడు ఒక సాధారణ వ్యక్తికన్నా తక్కువవాడై ఉండాలి. ఏమీ చేతకానివాడు .. అసమర్ధుడై ఉండాలి. ఈ పాత్రకి 'అలీ' అయితే బాగుంటాడని భావించాను .. అప్పటికీ ఆయనకి ఎలాంటి ఇమేజ్ లేదు .. అందువలన తీసుకున్నాను. ఈ సినిమాలో నువ్వే హీరోవి అని చెప్పినప్పుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు .. ఆ తరువాత ఆనందంగా ఒప్పుకున్నాడు.

 అప్పటివరకూ కమెడియన్ గా 'అలీ' చాలా చిన్నచిన్న వేషాలు వేస్తూ వెళుతున్నాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా హీరోగా మారిపోయి, ఒక బలమైన కథను తన భుజాల మీద మోస్తూ ప్రేక్షకుల మధ్యకు తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ కావడం గొప్ప విషయం. నిజంగా అలీ చాలా మంచి ఆర్టిస్ట్ .. ఈ సినిమాతో ఆయన తానేమిటనేది నిరూపించుకున్నాడు. ఈ కారణంగానే ఆ తరువాత కూడా హీరోగా ఆయన చాలా సినిమాలు చేశాడు" అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News