CEC: అధికారులతో కాకుంటే ముఖ్యమంత్రి ఎవరితో సమావేశం నిర్వహించాలి?: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

  • ఎన్నికల సంఘం తీరేమిటో అర్థం కావడం లేదు
  • డబ్బు పంపిణీ యథేచ్ఛగా జరిగినా ఆపగలిగారా
  • జేసీ దివాకర్‌ రెడ్డి ఖర్చు గురించి మాట్లాడితే ఏం చర్యలు తీసుకున్నారు

ఎన్నికల సంఘం తీరేమిటో అర్థం కావడం లేదని, తాను తీసుకోవాల్సిన చర్యల విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ అనవసర విషయాల్లో రాద్ధాంతం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అధికారులు ముఖ్యమంత్రిని కలవకూడదని చెబుతున్న ఎన్నికల సంఘం మరి ఎవరిని కలవాలో చెప్పాలని కోరారు.

ఇవాళ ఆయన అనంతపురంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పులివెందులలోని ఓ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఓటుకు రూ.5 వేలిస్తే, వైసీపీ రూ.6 వేలు ఇచ్చిందని, దీన్ని ఎవరైనా ఆపగలిగారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఖర్చు చేశానని టీడీపీ ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డి బహిరంగంగా ప్రకటిస్తే ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. ఇవన్నీ వదిలేసి ముఖ్యమంత్రిని అధికారులు కలుస్తున్నారని అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

 రాష్ట్ర సమస్యలపై సీఎం కేబినెట్‌ సమావేశం నిర్వహించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఇక రైతులకు 4, 5 విడతల రుణమాఫీ జరగలేదని, దీనికి ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా ఉందని పభ్రుత్వం చెప్పడాన్ని కూడా తప్పుపట్టారు.

More Telugu News