karthikeya: 'గుణ 369' టైటిల్ వివాదం

  • కార్తికేయ హీరోగా రూపొందుతోన్న 'హిప్పీ'
  • తదుపరి సినిమాగా 'గుణ 369'
  • దర్శకుడిగా అర్జున్ జంధ్యాల   

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్న కార్తికేయ, ప్రస్తుతం 'హిప్పీ' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఆయన 'గుణ 369' అనే టైటిల్ తో మరో ప్రాజెక్టును ను పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి అర్జున్ జంధ్యాల దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. టైటిల్ లోగోతో కూడిన పోస్టర్ ను కూడా ఇటీవల విడుదల చేశారు. టైటిల్ బాగుందనే రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఇప్పుడు ఈ టైటిల్ విషయంలోనే వివాదం తలెత్తింది. కళాధర్ కొక్కొండ అనే దర్శక నిర్మాత ఆల్రెడీ 'గుణ' టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో వుంది. తమ సినిమా టైటిల్ ను అర్జున్ జంధ్యాల టీమ్ వాడుకుంటూ .. ఆ టైటిల్ పక్కన '369' అంకెను తగిలించారని కళాధర్ కొక్కొండ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More Telugu News