ragini: మా నాన్నగారికి పక్షవాతం .. సీరియల్స్ లో చేస్తే రోజుకి 300 ఇచ్చేవారు: నటి రాగిణి

షార్ట్స్‌లో చూడండి
బుల్లితెరపై ధారావాహికలు చూసేవారికి రాగిణి గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. వెండితెరపై కూడా హాస్యనటిగా ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి రాగిణి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు.

"నా తొమ్మిదొవ యేటనే మా నాన్నగారికి పక్షవాతం వచ్చి కాలు - చేయి పడిపోయాయి. దాంతో నా చదువు ఆగిపోయింది. మా అక్కయ్య కృష్ణవేణి నాకు డాన్స్ నేర్పించింది. డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండటంతో, బాగా నేర్చుకున్నాను. అలా నాట్య ప్రదర్శనలు ఇస్తూ నెలకి మూడు వేలు సంపాదించేదాన్ని. ఆ డబ్బుతో అమ్మానాన్నలను చూసుకుంటూ ఉండేదానిని. దూరదర్శన్ లో 'వేమన' అనే ఒక సింగిల్ ఎపిసోడ్ లో చేసే అవకాశాన్ని అక్కయ్య కృష్ణవేణి ఇప్పించింది. అలా బుల్లితెరకి పరిచయమైన నేను, వరుసగా సీరియల్స్ చేసేదానిని. అప్పట్లో రోజుకి 300 ఇచ్చేవారు" అని చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
ragini

More Telugu News