Tamannaah: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'సైరా'లో రాణి పాత్రలో తమన్నా 
  • విడుదలలో 'మహర్షి' రికార్డు 
  • మలయాళంలో ఈ నెలలోనే 'రంగస్థలం'

*  చిరంజీవి హీరోగా నటిస్తున్న 'సైరా' చిత్రంలో తమన్నా ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. దీంతో ఆమె పాత్రపై అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. ఇందులో ఆమె ఓ రాణి పాత్రలో కనిపించనున్నట్టు తాజా సమాచారం. అయితే, ఈ పాత్ర పోకడ కాస్త నెగటివ్ టచ్ తో సాగుతుందట.
*  మహేశ్ బాబు హీరోగా నటించిన 'మహర్షి' చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని రేపు (గురువారం) ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఇక కర్ణాటకలో అయితే రికార్డు స్థాయిలో సుమారు 400 స్క్రీన్లపై రిలీజ్ అవుతున్నట్టు చెబుతున్నారు.
*  రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని మలయాళంలోకి అనువదించి ఈ నెల 24న కేరళలో విడుదల చేస్తున్నారు.

More Telugu News