Andhra Pradesh: చంద్రబాబు ఏవేవో మాట్లాడి హుందాతనం పోగొట్టుకున్నారు: బొత్స సత్యనారాయణ

  • ఈవీఎంలలో తప్పులు జరిగాయంటారు!
  • ఒక పార్టీకి ఓటేస్తే మరో పార్టీకి పడిందంటారు!
  • ‘పోలవరం’పై చంద్రబాబుది రోజుకో మాట  
ఈవీఎంలలో తప్పులు జరిగాయని, ఒక పార్టీకి ఓటేస్తే మరో పార్టీకి పడిందంటూ చంద్రబాబు ఏవేవో మాట్లాడుతూ తన హుందాతనం పోగొట్టుకున్నారని వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాజమండ్రిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టులు, కమీషన్ల కోసం రెండేళ్ల సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టుపై రోజుకో మాట మాట్లాడుతున్న చంద్రబాబు, ప్రజలను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇంత వరకూ పూర్తి కాకపోవడానికి కారణం చంద్రబాబు అసమర్థతేనని విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నట్టయితే, ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయి ఉండేదని అన్నారు. చంద్రబాబు తన మాయలు, మోసాలను ఇకనైనా ఆపాలంటూ ధ్వజమెత్తారు.
Andhra Pradesh
cm
Chandrababu
polavaram

More Telugu News