nithin: నిర్మాతగా నితిన్ .. ప్రధాన పాత్రధారిగా నిత్యామీనన్

  • నితిన్ చేతిలో మూడు సినిమాలు
  •  సొంత బ్యానర్లో ఒక సినిమా
  •  త్వరలోనే సెట్స్ పైకి

కథానాయకుడిగా నితిన్ మూడు సినిమాలను సెట్ చేసుకున్నాడు. ఈ మూడు సినిమాల్లో 'భీష్మ' ముందుగా సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తరువాత రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు. వాటికి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఇక నిర్మాతగా కూడా నితిన్ ఒక వైవిధ్యభరితమైన సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం.

ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిత్యామీనన్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి విష్వక్సేన్ దర్శకుడిగా వ్యవహరించడమే కాకుండా, ఒక కీలకమైన పాత్రను కూడా చేయనున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని చెబుతున్నారు. నాయికా ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో చేసి మెప్పించడం నిత్యామీనన్ కి అలవాటేననే విషయం తెలిసిందే.

More Telugu News