CPI: కేసీఆర్ ను నమ్మలేం... మా అనుమానాలు మాకున్నాయి: సురవరం

  • కేసీఆర్ వి అవకాశవాద రాజకీయాలు
  • ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతిచ్చే విషయం ఇప్పుడే చెప్పలేం
  • ఫలితాల తర్వాతే థర్డ్ ఫ్రంట్ గురించి ఆలోచన

ఓవైపు ఫెడరల్ ఫ్రంట్ కోసం సీఎం కేసీఆర్ వామపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేరళ వెళ్లగా, ఆయనపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు విషయంలో ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే థర్డ్ ఫ్రంట్ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు.

కేసీఆర్ చేసేవి అవకాశవాద రాజకీయాలని, ఈ విషయంలో కేసీఆర్ పై తమకుండే అనుమానాలు తమకున్నాయని సురవరం వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదని, ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటాడని ఆరోపించారు.

ఇక, కేసీఆర్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ల భేటీని ఇద్దరు సీఎంల భేటీగానే చూస్తామని అన్నారు. ఎందుకంటే, విజయన్ సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు మాత్రమేనని, జాతీయస్థాయిలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం ఆయన పరిధికి మించిన విషయం అని సురవరం స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయస్థాయి నాయకత్వం ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News