టీడీపీ, కాంగ్రెస్ లకు షాక్.. వీవీప్యాట్లపై రివ్యూ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు!
- 50 శాతం వీవీప్యాట్లు లెక్కించాలన్న ప్రతిపక్షాలు
- గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చబోమన్న సుప్రీం
- ఇప్పటికే లెక్కించే వీవీప్యాట్ల సంఖ్య 5కు పెంపు
50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ప్రతిపక్షాలు గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీన్ని విచారించిన ధర్మాసనం.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్ యంత్రాలను ర్యాండమ్ గా లెక్కించాలని ఈసీని ఆదేశించింది.
అప్పటివరకూ కేవలం ఓ వీవీప్యాట్ యంత్రంలోని స్లిప్పులను మాత్రమే ఈవీఎంలతో సరిపోల్చేవారు. అయితే ఈ ఆదేశాలపై సంతృప్తి చెందని ప్రతిపక్షాలు ఈ సంఖ్యను 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ మరోసారి సుప్రీం మెట్లు ఎక్కాయి.