bihar: బీహార్ లో అంతే... హోటల్ గదిలో ఈవీఎంలు లభ్యం

  • హోటల్ కు ఈవీఎంలు, వీవీప్యాట్లను తీసుకెళ్లిన సెక్టార్ మేజిస్ట్రేట్
  • నోటీసులు జారీ చేసిన ఈసీ
  • విచారణ జరుగుతుందన్న జిల్లా కలెక్టర్

అరాచకాలకు మారుపేరైన బీహార్ లో ఎన్నికలు కూడా గందరగోళంగానే జరుగుతున్నాయి. పోలింగ్ సందర్భంగా సెక్యూరిటీ వైఫల్యాలు పలుచోట్ల కనిపిస్తున్నాయి. ముజఫరాబాద్ లోని ఓ హోటల్ లో ఏకంగా ఆరు ఈవీఎంలు, వీవీప్యాట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ సీజ్ చేశారు.

ఈ ఈవీఎంలు, వీవీప్యాట్లను సెక్టార్ మేజిస్ట్రేట్ అవధేశ్ కుమార్ హోటల్ కు తీసుకెళ్లినట్టు సమాచారం. తన డ్రైవర్ ఓటు వేసేందుకు గాను వీటిని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కగానే భారీ ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. మేజిస్ట్రేట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలో అవధేశ్ కుమార్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. అతనిపై డిపార్ట్ మెంటల్ విచారణ జరుగుతుందని జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఘోష్ తెలిపారు.

More Telugu News