Ramadan: ఆకాశంలో కనిపించిన నెలవంక... రేపటి నుంచి రంజాన్ మాసం

  • ఆదివారం కనిపించని నెలవంక
  • సోమవారం ప్రత్యక్షం
  • రంజాన్ ప్రకటన చేసిన రుహియతే హిలాల్ కమిటీ
ముస్లింలకు పరమ పవిత్రమైనది రంజాన్ మాసం. ఆకాశంలో నెలవంక కనిపించడాన్ని బట్టి రంజాన్ మాసం ఆరంభం నిర్ణయిస్తారు. ఈసారి రంజాన్ మాసం మంగళవారం ప్రారంభమవుతుందని హైదరాబాద్ లోని రుహియతే హిలాల్ కమిటీ పేర్కొంది. ఆదివారం నాడు నెలవంక దర్శనం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్ పాషా ఖత్తారీ తెలిపారు. సోమవారం ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ఆరంభానికి మంగళవారం అనువైనదిగా ప్రకటించారు. ఈ క్రమంలో మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు రంజాన్ ఉపవాసాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు.
Ramadan
Andhra Pradesh
Telangana
Hyderabad

More Telugu News