Sidda Raghava Rao: ఆ అధికారం ఎవరికైనా ఉంటుంది.. అడ్డుకోవడం సరికాదు: మంత్రి శిద్దా రాఘవరావు

  • పోలింగ్ సరళిని పరిశీలించిన శిద్దా
  • ఏ పార్టీ నేతలకైనా ఉంటుంది
  • టీడీపీ అభ్యర్థులను అడ్డుకోవడం సరికాదు
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సరళిని పోటీలో ఉన్న అభ్యర్థి వచ్చి చూసుకునే అధికారం ఉంటుందని మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం, కలనూతలలో బూత్ నంబర్ 247లో పోలింగ్ సరళిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎన్నికల తీరును పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ అభ్యర్థులను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. పోలింగ్ సరళిని చూసుకునే అధికారం ఎవరికైనా ఉంటుందని, దాన్ని రిటర్నింగ్ అధికారులు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని అన్నారు.  
Sidda Raghava Rao
Prakasam
Polling
Returning officer
Telugudesam

More Telugu News