tarak: అభిమాని జయదేవ్ లేరనే వార్త నన్ను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది: జూనియర్ ఎన్టీఆర్

  • కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ మృతి
  • తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎన్టీఆర్
  • జయదేవ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన తారక్
కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు తారక్ ఒక లేఖను విడుదల చేశాడు. తన కెరీర్ మొదటి నుంచి జయదేవ్ తనకు అండగా ఉన్నారని, ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని చెప్పాడు. జయదేవ్ లేరనే వార్త తనను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని తెలిపాడు.

నటుడిగా తాను ఎదుర్కొన్న ఎత్తుపల్లాల్లో తన వెంటన ఉన్నది తన అభిమానులేనని చెప్పాడు. తనకు తోడున్న వారిలో జయదేవ్ చాలా ముఖ్యమైనవారని తెలిపాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాడు. జయదేవ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. అంతేకాదు, జయదేవ్ తో కలసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
tarak
junior ntr
jayadev

More Telugu News