Ramcharan: బాల్యంలో చదువుకున్న స్కూలుకు వెళ్లి భావోద్వేగాలకు లోనైన రామ్ చరణ్

  • ఊటీలోని లారెన్స్ లవ్ డేల్ స్కూలు సందర్శించిన చెర్రీ
  • మర్చిపోలేని అనుభూతి అంటూ కామెంట్
  • సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసిన ఉపాసన

చిన్ననాటి పాఠశాల జ్ఞాపకాలను చాలామంది తమ జీవితంలో ఎంతో అపురూపంగా భావిస్తుంటారు. టాలీవుడ్ యువ హీరో రామ్ చరణ్ కూడా బాల్యంలో తాను ఊటీలో చదువుకున్న స్కూలుకు వెళ్లి, అక్కడ తాను గడిపిన క్షణాలను గుర్తుచేసుకుని భావోద్వేగభరితుడయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ అప్పటి మద్రాసు నగరంలో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ ను తమిళనాడులోని ఊటీలో వున్న లారెన్స్ లవ్ డేల్ స్కూల్లో చదివించారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేయడంతో మిగతా విద్యాభ్యాసం అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే సాగింది.

మళ్లీ ఇన్నాళ్ల తర్వాత తాను చిన్నప్పుడు చదువుకున్న స్కూలుకు వెళ్లిన రామ్ చరణ్ అక్కడి మెస్, డార్మిటరీ, లాన్ వంటి పలు ప్రదేశాల్లో కలియదిరిగి ఆనాటి జ్ఞాపకాల్లో మునిగితేలారు. దీని గురించి ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో పాఠశాల జీవితం ఎంతో మధురమైనదని, మళ్లీ బాల్యంలో అడుగుపెట్టినట్టుగా ఉందని లారెన్స్ లవ్ డేల్ స్కూలు సందర్శన సందర్భంగా చెర్రీ వ్యాఖ్యానించారు.

More Telugu News