Andhra Pradesh: రేపు ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్: ఈసీ ద్వివేది

  • గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో రీపోలింగ్
  • ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఓటెయొచ్చు
  • గుంటూరు, నరసరావుపేట, యర్రగొండపాలెం, సూళ్లూరుపేట, అటకానితిప్పలో రీపోలింగ్

ఏపీలోని మూడు జిల్లాల పరిధిలోని ఐదు చోట్ల రేపు రీపోలింగ్ నిర్వహించనున్నట్టు సీఈవో ద్వివేది తెలిపారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నామని, ఎన్నికల పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని తెలిపారు. నరసరావుపేట అసెంబ్లీ స్థానం పరిధిలోని 94వ బూత్ లో, గుంటూరు పశ్చిమ స్థానం పరిధిలోని 244వ బూత్ లో, యర్రగొండపాలెం అసెంబ్లీ స్థానం పరిధిలోని 247వ బూత్ లో, కోవూరు అసెంబ్లీ స్థానం పరిధిలోని 41వ బూత్ లో, సూళ్లూరుపేట అసెంబ్లీ స్థానం పరిధిలోని అటకానితిప్పలోని 197వ బూత్ లో రీపోలింగ్ జరగనున్నట్టు తెలిపారు. 

  • Loading...

More Telugu News