cpi: హిందూ ధర్మంపై నమ్మకం లేకపోతే మీ పేరు మార్చుకోండి: సీతారాం ఏచూరిపై శివసేన ఫైర్

  • చెంగిజ్ ఖాన్ లేదా ఔరంగజేబుగా పేరు మార్చుకోండి
  • రామాయణ, భారతాలు హింసాత్మక ఘటనలతో నిండి ఉన్నాయా?
  • పాక్ ను ఎదుర్కోవడం కూడా హింసేనా?

రామాయణ, మహాభారతాలు రెండూ యుద్ధాలతో పాటు హింసాత్మక ఘటనలతో నిండి ఉన్నాయంటూ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్యలపై శివసేన మండిపడుతోంది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ, హిందూ ధర్మంపై నమ్మకం లేనప్పుడు ఆయనకు ‘సీతారాం’ అనే పేరు ఎందుకు? బాబర్, చెంగిజ్ ఖాన్, ఔరంగజేబుగా తన పేరును మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 

రామాయణ, మహాభారతాలు ఇచ్చే సందేశం ఒకటేనని, చెడుపై మంచి గెలుస్తుందన్నదేనని అన్నారు. హిందువులు హింసాత్మకంగా ఉంటారనడంలో ఆయన ఉద్దేశం ఏంటి? రాముడిపై నమ్మకం లేని వారు ఈ దేశంలో ఉండడానికి అనర్హులని అన్నారు. రామాయణ, మహాభారతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్లు రేపు పాకిస్థాన్ మీద భారత సైనికుల పోరాటం కూడా హింసాత్మకమనే వ్యాఖ్యలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ ను ఎదుర్కోవడం కూడా హింసేనా? అని ప్రశ్నించారు. 

More Telugu News