Andhra Pradesh: వివాహేతర సంబంధం ఎఫెక్ట్.. ప్రియుడి ఇంటికెళ్లి కత్తితో దాడిచేసిన భర్త!

  • తీవ్రగాయాలతో తప్పించుకున్న బాధితుడు
  • కృష్ణా జిల్లాలో ఘటన
  • హెచ్చరించినా వివాహేతర సంబంధం మానుకోని వైనం
వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం నచ్చని ఓ భర్త ఆమె ప్రియుడిపై కత్తితో వెంటపడి దాడిచేశాడు. ఈ ఘటనలో బాధితుడు త్రుటిలో తప్పించుకున్నాడు. కృష్ణా జిల్లాలో నిన్నరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని గుడివాడ వాంబే కాలనీలో మురళీకృష్ణ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన గంగరాజుతో ఇతనికి పరిచయం ఏర్పడింది. దీంతో మురళీకృష్ణ ఇంటికి గంగరాజు వచ్చిపోతూ ఉండేవాడు. ఈ క్రమంలో గంగరాజుకు మురళీకృష్ణ భార్యతో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న మురళీకృష్ణ భార్యను, గంగరాజును తీవ్రంగా హెచ్చరించాడు. అయినా గంగరాజు పద్ధతి మానుకోలేదు.

ఈ నేపథ్యంలో నిన్న రాత్రి భార్యాభర్తల మధ్య ఈ విషయమై మరోసారి గొడవ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన మురళీకృష్ణ కత్తి, కారంపొడి తీసుకుని గంగరాజు ఇంటికి వెళ్లాడు. తలుపు తీసిన గంగరాజు కళ్లలో కారం కొట్టి కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన గంగరాజు ఎలాగోలా ఘటనాస్థలం నుంచి పారిపోగలిగాడు. దీంతో కోపం తగ్గని మురళీకృష్ణ అతని బైక్ పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కాగా, ఈరోజు బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో మురళీకృష్ణను అరెస్ట్ చేశారు.
Andhra Pradesh
Krishna District
attack
extra martial affair]
Police

More Telugu News