Nara Lokesh: మంగళగిరిలో ఓడిపోతానని భయపడుతున్న లోకేశ్... తమిళ దినపత్రిక సంచలన కథనం!

  • తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేశ్
  • ఓటమి తప్పదన్న ఆందోళనలో ఉన్నారు
  • ప్రత్యేక కథనంలో 'దినమలర్'

ఆదిలోనే హంసపాదు' అనే శీర్షికతో తమిళ దినపత్రిక 'దిన మలర్' ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. మంగళగిరిలో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఏపీ మంత్రి నారా లోకేశ్ కు ఓడిపోతానన్న భయం ఉందన్నది ఈ కథనం సారాంశం. తండ్రి సీఎంగా ఉండి కూడా, ఓటమి తప్పదేమోనన్న ఆందోళనలో లోకేశ్ ఉన్నారని, మంత్రిగా ఉండి కూడా కచ్చితంగా గెలుస్తానన్న ధైర్యం ఆయనలో లేదని పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్న లోకేశ్ కు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తరువాత గెలుపు సులువు కాదని తెలిసివచ్చిందని, ప్రస్తుతం ఆయన ఆందోళనలో ఉన్నారని పేర్కొంది.

More Telugu News