AMB Cinemas: ఏఎంబీ సినిమాస్ లో టికెట్ అడిగితే లేదన్నారు: మహేశ్ బాబు

  • 'మహర్షి' ప్రమోషన్ లో బిజీగా ఉన్న మహేశ్ బాబు
  • 'అవెంజర్స్' చూద్దామంటే టికెట్లు లేవంటున్నారు
  • మీడియాతో సరదాగా మాట్లాడిన మహేశ్
తాను నటించిన 'మహర్షి' సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, తన ఏఎంబీ సినిమాస్ లో సినిమా టికెట్ ను పొందలేకున్నారట. ఈ మాటను ఆయనే అంటున్నారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఏఎంబీ సినిమాస్ లో 'అవెంజర్స్: ఎండ్ గేమ్' సినిమాను చూశారన్న సంగతి తెలిసిందే. 'మహర్షి' ప్రమోషన్ లో భాగంగా మహేశ్ బాబు, మీడియాతో మాట్లాడగా, జగన్ సినిమా చూశారన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. మీరు అవెంజర్స్ చూశారా? అన్న మీడియా ప్రశ్నకు, చాలా మంది సెలబ్రిటీలు ఏఎంబీకి వచ్చి సినిమాలు చూస్తున్నారని, తాను చూద్దామని టికెట్లు అడిగితే లేవని చెబుతున్నారని సరదాగా అన్నారు. రెండు రోజుల్లో 'అవెంజర్స్' సినిమా చూస్తానని చెప్పుకొచ్చారు.
AMB Cinemas
Mahesh Babu
Jagan
Avengers

More Telugu News