trisha: ఉత్కంఠను రేకెత్తిస్తోన్న త్రిష 60వ సినిమా ట్రైలర్

  • త్రిష తాజా చిత్రంగా 'పరమపదం విలయాట్టు'
  • పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
  •  త్వరలో ప్రేక్షకుల ముందుకు

త్రిష ఒక వైపున సీనియర్ హీరోల సరసన నాయికగా ప్రేక్షకులను అలరిస్తూనే, మరో వైపున నాయికా ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ వెళుతోంది. ఈ మధ్యకాలంలో హారర్ చిత్రాలను ఎక్కువగా చేస్తూ వచ్చిన త్రిష, ఓ పొలిటికల్ థ్రిల్లర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 'పరమపదం విలయాట్టు' టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమాకి 'తిరుజ్ఞానం' దర్శకత్వం వహిస్తున్నాడు.

త్రిష కెరియర్లో ఇది 60వ సినిమా. ఈ రోజున త్రిష పుట్టినరోజు కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. త్రిష చుట్టూ తిరిగే కథ కావడంతో, ఆమె కాంబినేషన్లోని ఆసక్తికరమైన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ ట్రైలర్ తో ఉత్కంఠను పెంచడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

More Telugu News