jayam ravi: 9 రకాల విభిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్న తమిళ హీరో

  • కామెడీ ఎంటర్టైనర్ గా 'కోమలి'
  • జయం రవి జోడీగా కాజల్ 
  • ముఖ్యమైన పాత్రలో యోగిబాబు 
తమిళంలో స్టార్ హీరోల జాబితాలో జయం రవి కూడా కనిపిస్తాడు. మొదటి నుంచి కూడా వైవిధ్యభరితమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ, తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అలాంటి జయం రవి తాజా చిత్రంగా తమిళంలో 'కోమలి' సినిమా రూపొందుతోంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా, ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఈ సినిమాలో జయం రవి 9 గెటప్పులలో కనిపిస్తాడట. ఆయన ధరించే ఈ 9 గెటప్పులు, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఒక్కో గెటప్పు ఒక్కో మలుపుకు కారణమవుతూ, కథ ఆసక్తికరంగా కొనసాగుతుందని అంటున్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగు జరుపుకున్న ఈ సినిమాలో, జయం రవి జోడీగా కాజల్ కనిపించనుంది. ఇక మరో కథానాయికగా సంయుక్తా హెగ్డే కనిపించనుండగా, కమెడియన్ గా యోగిబాబు సందడి చేయనున్నట్టు సమాచారం.
jayam ravi
kajal

More Telugu News