akhilesh yadav: అచ్చం యోగి ఆదిత్యనాథ్ లా ఉన్న బాబాను రంగంలోకి దించిన అఖిలేశ్ యాదవ్

  • కాషాయ వస్త్రాలను ధరించిన బాబా
  • ముఖాన్ని మాత్రం చూపించని అఖిలేశ్
  • అన్ని నిజాలను బాబా చెబుతారన్న ఎస్పీ అధినేత

అచ్చుగుద్దినట్టు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లా ఉన్న బాబాను సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అందరికీ పరిచయం చేశారు. యోగి మాదిరే ఈ బాబా కూడా పూర్తిగా కాషాయ వస్త్రాలను ధరించారు. అంతేకాదు తలను కూడా పూర్తిగా షేవ్ చేసుకున్నారు. అయితే, ఆయన ముఖాన్ని మాత్రం అఖిలేశ్ చూపించలేదు. తన పక్కన బాబా ఉన్న ఫొటోలను ట్విట్టర్ ద్వారా అఖిలేశ్ షేర్ చేశారు.

'మేము నకిలీ దేవుడిని తీసుకురాలేదు. ఒక బాబాను తీసుకొచ్చాం. గోరఖ్ పూర్ నుంచి ఆయన మాతో పాటు వచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అసలైన నిజాలన్నింటినీ ఉత్తరప్రదేశ్ లోని అందరికీ వివరిస్తారు' అంటూ అఖిలేశ్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News