nayanatara: ఎంగేజ్ మెంట్ కి సిద్ధమవుతోన్న నయనతార, విఘ్నేశ్ శివన్

  • విఘ్నేశ్ ప్రేమలో నయనతార 
  • తరచూ విదేశాల్లో విహరిస్తోన్న జంట 
  • వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలనే ఆలోచన
నయనతార, విఘ్నేశ్ శివన్ లు చాలాకాలం క్రితమే ప్రేమలో పడ్డారు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. నయనతార తన చేతిలో వున్న ప్రాజెక్టులను పూర్తిచేసి, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలను ఎంతమాత్రం పట్టించుకోకుండా తన సినిమాలు చేసుకుంటూ, వీలు చిక్కినప్పుడల్లా విఘ్నేశ్ తో విదేశాల్లో విహరిస్తూ నయనతార జాలీగా గడిపేస్తోంది.

ఈ ఇద్దరూ ఎంగేజ్ మెంట్ కి సిద్ధమవుతున్నారనేది తాజా సమాచారం. త్వరలో బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ జరుపుకుని, వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అటు నయన్ ఫ్యామిలీ నుంచి, ఇటు విఘ్నేశ్ కుటుంబ సభ్యుల నుంచి వత్తిడి పెరుగుతూ ఉండటంతోనే ఈ ఇద్దరూ ఈ నిర్ణయానికి వచ్చారని కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఎంగేజ్ మెంట్ డేట్ చెప్పే అవకాశాలు వున్నాయి.   
nayanatara
vighnesh

More Telugu News