mahanati: ‘మహానటి’కి అరుదైన ఘనత.. షాంఘై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా రికార్డు!

  • సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా
  • ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌నోర‌మ‌ విభాగంలో ఎంపిక
  • మెయిన్‌ల్యాండ్ చైనాలో సందడి చేయనున్న ‘మహానటి’
పాతకాలం నాటి దిగ్గజ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘మహానటి’ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. 22వ షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (ఎస్ఐఎఫ్ఎఫ్)కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా ఇది రికార్డులకెక్కింది. ‘ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌నోర‌మ‌' విభాగంలో ఈ సినిమాను ఎంపిక చేశారు. ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా మెయిన్‌ల్యాండ్ చైనాలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.

వైజ‌యంతీ మూవీస్‌- స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ నటి కీర్తి సురేశ్  టైటిల్ పాత్ర‌లో నటించగా, దుల్క‌ర్ స‌ల్మాన్‌, స‌మంత అక్కినేని, విజ‌య్ దేవ‌ర‌కొండ స‌హా ద‌క్షిణాది స్టార్స్ అంద‌రూ ఈ చిత్రంలో న‌టించారు.  గతేడాది మే 9న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ లభించింది.
mahanati
savitri
Tollywood
SIFF
Mainland china
keerthi suresh

More Telugu News