Andhra Pradesh: మోదీ ఏం మాట్లాడినా ఈసీకి సంగీతం విన్నట్టు ఉంటుంది!: సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. ఉండవల్లిలోని ప్రజా వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ రక్షణలో జగన్ హాయిగా ఉన్నారని, హైదరాబాద్ లో కూర్చున్న ఆయన ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు.

ఇక మోదీ మరోసారి ప్రధాని కారన్న విషయం ఇప్పటికే స్పష్టమైందని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల క్రితం అమిత్ షా ఎవరికైనా తెలుసా? తాము గొప్ప నేతలమని మోదీ, అమిత్ షాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘం ప్రవర్తన వింతగా ఉందని, మోదీ ఏం మాట్లాడినా ఈసీకి సంగీతం విన్నట్టు ఉంటుందని విమర్శించారు. 
Go Back to Shorts
Andhra Pradesh
cm
Chandrababu
modi
amit

More Telugu News