narayana rao: చిరంజీవి 'దేవాంతకుడు' సినిమా విషయంలో అలా జరిగింది: సీనియర్ నటుడు నారాయణరావు

  • కన్నడలో 'దేవాంతకుడు' ఫ్లాప్ 
  • తెలుగులో మార్పులు చేశాము
  •  విజయ్ కాంత్ కి లైఫ్ ఇచ్చింది

నటుడిగా చిరంజీవి తన కెరియర్ ను ప్రారంభించక మునుపే, నారాయణరావు సినీరంగంలోకి ప్రవేశించారు. చిరంజీవితో స్నేహం ఏర్పడిన తరువాత ఆయన హీరోగా కొన్ని సినిమాలను నిర్మించారు. అలా ఆయన నిర్మించిన చిత్రాలలో 'దేవాంతకుడు' ఒకటి. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి నారాయణరావు మాట్లాడుతూ, "చిరంజీవి హీరోగా 'దేవాంతకుడు' చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాను. మరో 15 రోజుల్లో షూటింగు మొదలవుతుందనగా, ఆ కథతో కన్నడలో అంబరీష్ చేసిన సినిమా పరాజయంపాలైంది.

దాంతో తెలుగులో చేయాలా? వద్దా? అని ఆలోచనలో పడ్డాను. కన్నడలో ఆ సినిమా పరాజయంపాలు కావడానికి కారణం .. హీరోకన్నా విలన్ ను పవర్ ఫుల్ గా చూపించడమేనని అర్థమైంది. దాంతో ఆ లోపాన్ని తెలుగులో సరిచేయించి నిర్మించాను. తెలుగులో 'దేవాంతకుడు' సూపర్ హిట్ అయింది. ఇదే సినిమాను తమిళంలో విజయ్ కాంత్ హీరోగా రీమేక్ చేస్తే అక్కడ కూడా హిట్ అయింది. అప్పటికి సినిమాలు మానేసి మధురై వెళ్లిపోయిన విజయ్ కాంత్ ను ఈ సినిమా మళ్లీ హీరోగా నిలబెట్టేసింది" అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News