USA: మర్యాదలు నేర్చిన మొసలి.. ఇంటి కాలింగ్ బెల్ నొక్కేందుకు ప్రయత్నం.. షాకైన ఓనర్!

  • అమెరికాలోని దక్షిణ కరోలీనాలో ఘటన
  • ఇటీవల ఇంటిని కొనుగోలు చేసిన మహిళ
  • షాపింగ్ కు వెళ్లిరాగా, ఇంటిముందు మొసలి ప్రత్యక్షం

మొసళ్లను దూరం నుంచి చూస్తేనే గుండెలు జారిపోతాయి. అనేక జీవుల్ని మొసళ్లు నిర్దయగా మింగేస్తాయ్. తాజాగా అమెరికాలోని ఓ మహిళకు ఇలాంటి మొసలితో విచిత్రమైన పరిస్థితి ఎదురయింది.  దక్షిణ కరోలీనాలోని మైర్టెల్ బీచ్ సమీపంలో ఓ మహిళ కొత్త ఇంటిని ఇటీవల కొనుగోలు చేసింది. అనంతరం షాపింగ్ కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకుంది. అక్కడ జరుగుతున్న ఘటనను చూసి షాక్ కు గురయింది.

ఎందుకంటే, ఆమె ఇంటి గుమ్మం ముందు 4-5 అడుగులున్న మొసలి ఒకటి తచ్చాడుతోంది. అది అక్కడితో ఆగకుండా ఇంటి కాలింగ్ బెల్ నొక్కేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఈ తతంగాన్ని తన ఫోన్ లో రికార్డు చేసిన సదరు మహిళ.. జంతు సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. ఆ చిలిపి మొసలిని పట్టుకుని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.




More Telugu News