Andhra Pradesh: ఏపీ సీఎం, సీఎస్ కు గవర్నర్ ఫోన్.. సహాయక చర్యలపై ఆరా!

  • ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ‘ఫణి’ ప్రభావంపై ఆరా
  • సహాయక చర్యల గురించి అడిగిన గవర్నర్
  • గవర్నర్ కు వివరించి చెప్పిన సీఎస్

ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ‘ఫణి’ తుపాన్ ప్రభావంపై గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుకు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఈరోజు ఆయన ఫోన్ చేశారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఏ విధంగా నిర్వర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై గవర్నర్ కు సీఎస్ వివరించి చెప్పినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, ‘ఫణి’ తుపాన్ కారణంగా ఏపీలో యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తోంది. తుపాన్ ప్రభావం బెంగాల్ పైనా ఉండనున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. కోల్ కతా సహా పశ్చిమ మిడ్నాపూర్, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

More Telugu News