VVPAT`s: వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై రివ్యూ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

  • చంద్రబాబు సహా 21 పార్టీల రివ్యూ పిటిషన్
  • దీన్ని త్వరగా విచారించాలని కోరిన అభిషేక్ సింఘ్వీ
  • వచ్చే వారం విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టు తీర్పుపై చంద్రబాబు సహా 21 ప్రతిపక్ష పార్టీలు ఇటీవల రివ్యూ పిటిషన్ వేశాయి. రివ్యూ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 21 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్ ను వచ్చే వారం విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ ను త్వరగా విచారించాలని సీజేఐ కు కాంగ్రెస్ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ విజ్ఞప్తి చేశారు. కాగా, 50 శాతం వీవీ ప్యాట్ యంత్రాల స్లిప్పులు తప్పనిసరిగా లెక్కించాలని పిటిషన్ లో కోరారు. గతంలో ఒక్కో అసెంబ్లీ స్థానంలో 5 వీవీ ప్యాట్ యంత్రాల స్లిప్పులు లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 
VVPAT`s
Review petetion
cm
Chandrababu
Supreme Court
congress
abhishek manu singhvi

More Telugu News