Papireddy: సంస్కరణలకు దిగిన ఉన్నత విద్యామండలి.. ముగ్గురు వీసీలతో కమిటీ

  • ఉప కులపతులతో సమావేశం 
  • నెల రోజుల్లో నివేదిక అందజేయాలి
  • డిగ్రీ ప్రవేశాల కోసం 9న నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన వంటి విషయాలలో సంస్కరణలు తేవడానికి ఉన్నత విద్యామండలి పూనుకుంది. ఈ క్రమంలో నేడు తొమ్మిది విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో తెలంగాణ రాష్ట్ర ఉన్న విద్యామండలి చైర్మన్ ఆచార్య పాపిరెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వైస్ చైర్మన్లు లింబాద్రి, వెంకట రమణలు సమావేశమయ్యారు.

రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సులు, డిగ్రీతో సంప్రదాయ కోర్సులకు సంబంధించిన పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో సంస్కరణలు సూచించేందుకు ముగ్గురు ఉపకులపతులతో ఉన్నత విద్యా మండలి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నెల రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. డిగ్రీ ప్రవేశాల కోసం ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. అనంతరం 10 నుంచి 27 వరకూ దోస్త్ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లు స్వీకరించనున్నారు.

More Telugu News