Maharastra: సరదాగా గడిపేందుకు డ్యామ్‌కు వెళ్లిన విద్యార్థులు.. ముగ్గురి మృతి

  • ముల్షి డ్యామ్‌కు వెళ్లిన స్నేహితుల బృందం
  • ఎంబీఏ చదువుతున్న విద్యార్థులు
  • లభ్యం కాని యువకుడి ఆచూకీ
మహారాష్ట్రలోని పుణెకు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న ముల్షి డ్యామ్‌కు పది మంది విద్యార్థులు సరదాగా గడిపేందుకు వెళ్లారు. అందరూ సరదాగా నీటిలోకి దిగారు. వెళ్లిన వారిలో శుభంరాజ్ సిన్హా (22), శివ్‌‌కుమార్ (22), సంగీత నేగి (22) అనే ముగ్గురు విద్యార్థులు నీటిలోనే మునిగి ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులంతా భారతి విద్యాపీఠ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నారు. వీరంతా కొత్రూడ్ సొసైటీలో ఉంటున్నారు.

ముగ్గురు విద్యార్థులు మునిగిపోతున్న సమయంలో మిగతా వారు అక్కడే ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో యువతితో పాటు ఓ యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మరో యువకుడి ఆచూకి ఇంకా లభ్యం కాలేదు. శివకుమార్, సిన్హాలది ఉత్తరప్రదేశ్ కాగా, సంగీతను ఢిల్లీకి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించి పోలీసులు కేసు విచారిస్తున్నారు.
Maharastra
Mulshi Dam
Sangeetha Negi
Subhamraj Sinha
Shiva kumar
Bharathi vidyapeeth University

More Telugu News