Hyderabad: నిరాహారదీక్ష చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు అస్వస్థత

  • కడుపు నొప్పితో బాధపడుతున్న లక్ష్మణ్
  • వైద్యులకు తెలియజేసిన లక్ష్మణ్ వ్యక్తిగత సిబ్బంది
  • ఇంటర్ విద్యార్థులకు న్యాయం కోసం లక్ష్మణ్ దీక్ష
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిమ్స్ లో నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న లక్ష్మణ్ అస్వస్థతకు గురయ్యారు. ఎటువంటి ఆహారం, ఫ్లూయిడ్స్ తీసుకోక పోవడంతో లక్ష్మణ్ కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ మేరకు వైద్యులకు లక్ష్మణ్ వ్యక్తిగత సిబ్బంది సమాచారమిచ్చారు. కాగా, ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ తన నిరాహారదీక్ష విరమించే పరిస్థితే లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. గత నెల 29న తన నిరవధిక నిరాహార దీక్షను లక్ష్మణ్ ప్రారంభించారు. 
Hyderabad
NIMS
BJP
laxman
Intermediate

More Telugu News