Chandrababu: కౌంటింగ్ రోజు ఏం చేయాలంటే... కార్యకర్తలకు చంద్రబాబు కీలక సూచనలు!

  • కౌంటింగ్ ప్రక్రియకు దగ్గరవుతున్నాం
  • అందరూ ప్రిపేర్ కావాలి
  • ప్రతి బృందంలో ఐటీ ఎక్స్ పర్ట్, న్యాయవాది తప్పనిసరి
  • ఏజంట్లు చివరి క్షణం వరకూ కౌంటింగ్ హాల్ లో ఉండాలి
  • కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన కౌంటింగ్ ప్రక్రియకు దగ్గరవుతున్నామని, ఈ సమయంలో ముందస్తుగా ప్రతి కార్యకర్త ప్రిపేర్ అయి ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. కార్యకర్తలు, నాయకులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ బృందంలో ఓ న్యాయవాది, మరో ఐటీ నిపుణుడు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.

ఇందుకోసం వచ్చే రెండు వారాల్లో కౌంటింగ్ పై వర్క్ షాప్ లను పెట్టుకోవాలని, 23న అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గతంలో జరిగిన ఓటింగ్ ఎన్నికల సరళిని విశ్లేషించాలని, ఈ టీమ్ ఏ బూత్ లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పేలా ఉండాలని, ఫలితాలు వచ్చాక బేరీజు వేసుకుని ముందుకు సాగేలా ఉండాలని అన్నారు.

భవిష్యత్ రాజకీయాలకు ఈ కౌంటింగ్ ను కేస్ స్టడీ గా తీసుకోవాలని సూచించారు. మధ్యలో లేచి వచ్చే వారిని ఏజంట్లుగా నియమించ వద్దని ఆదేశించిన ఆయన, కౌంటింగ్ ముగిసే ఆఖరు క్షణం వరకూ ఏజంట్లు ఓపికగా ఉండాలని నిర్దేశించారు. అటువంటి వారిని మాత్రమే నియమించుకోవాలని, ఎవరు బాగా పనిచేశారో కౌంటింగ్ ముగియగానే నివేదికలు పంపాలని అన్నారు.

  • Loading...

More Telugu News