Telangana: ప్రమాదంలో చార్మినార్.. కుప్పకూలిపోయిన కొంత భాగం!

  • నిన్న రాత్రి ఓ గుమ్మటం నుంచి విరిగిపడ్డ పెళ్లలు
  • ఘటనాస్థలంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
  • 1591లో నిర్మించిన చారిత్రక కట్టడం

హైదరాబాద్ లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం చార్మినార్ లో కొంత భాగం కూలిపోయింది. చార్మినార్ కు నాలుగు గుమ్మటాలు ఉండగా, వాటిలో ఓ గుమ్మటానికి సంబంధించి కొంత భాగం నిన్న రాత్రి సమయంలో నేలపై పడిపోయింది. ఈ సమయంలో ఘటనాస్థలి వద్ద ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా, ఈ ప్రమాదం జరగటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఈ నేపథ్యంలో నేడు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) అధికారులు నగరానికి చేరుకుని ఈ ప్రమాదంపై విచారణ జరుపుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గోల్కొండ పాలకుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఆదేశాలతో 1591లో చార్మినార్ ను నిర్మించారు.

More Telugu News