Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లా పాలకొండలో విడుదలైన 'లక్ష్మీస్ ఎన్టీఆర్'!

  • ఏపీలో నిలిచిపోయిన సినిమా విడుదల
  • శ్రీరామా కళామందిర్ లో ప్రదర్శన
  • అడ్డుకున్న అధికారులు, థియేటర్ యాజమాన్యంపై కేసు
నిన్న ఆంధ్రప్రదేశ్ లో విడుదల కావాల్సిన రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాను శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ప్రదర్శించారు. పట్టణంలోని శ్రీరామా కళామందిర్, శ్రీసాయి కళామందిర్ జంట థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. భారీ ఎత్తున ప్రేక్షకులు చిత్రం చూసేందుకు రాగా, విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు థియేటర్ వద్దకు చేరుకుని, సినిమాను మధ్యలోనే ఆపివేయించారు. ఈ సందర్భంగా అభిమానులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సినిమా విడుదలకు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ, చిత్రాన్ని ప్రదర్శించినందుకు థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.
Andhra Pradesh
Srikakulam District
Palakonda Lakshmis NTR

More Telugu News