Fani: ఉత్తరాంధ్రలో జల్లులతో మొదలైన 'ఫణి' ప్రభావం!

  • శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మొదలైన వర్షం
  • పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు
  • ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించిన 'ఫణి' తీవ్ర పెనుతుపానుగా మారడంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా తీరం వణికిపోతోంది. ఈ మధ్యాహ్నం నుంచి దిశ మార్చుకోవడం మొదలుపెట్టిన ఫణి ప్రస్తుతం ఈశాన్య దిశగా పయనిస్తోంది. తాజాగా ఈ భీకర తుపాను ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొదలైంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలు చోట్ల జల్లులు ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

మే 2, 3వ తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో బుధవారం రాత్రి జల్లులు మొదలవడంతో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. ముఖ్యంగా, వంశధార, నాగావళి నదులకు వరద వస్తే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News